Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:30 PM

గుండ్రంపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు, భారీ ట్రాఫిక్ జామ్

28-06-2026 1,215 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూన్ 28: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మూడు కార్లు, ఒక బైకు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.

సమాచారం మేరకు, ముందువెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు నియంత్రణ కోల్పోయి వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు కార్లలో ప్రయాణిస్తున్న మొత్తం పది మందిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది.

ప్రమాదం తీవ్రతకు కార్లు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలుకిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించగా, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

గుండ్రంపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు, భారీ ట్రాఫిక్ జామ్

Article Image

చిట్యాల, జూన్ 28: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మూడు కార్లు, ఒక బైకు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.

సమాచారం మేరకు, ముందువెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు నియంత్రణ కోల్పోయి వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు కార్లలో ప్రయాణిస్తున్న మొత్తం పది మందిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది.

ప్రమాదం తీవ్రతకు కార్లు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలుకిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించగా, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News