Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:25 PM

హెలెన్ కెల్లర్ ఆశయాలు ఆచరణలోకి రావాలి.

హెలెన్ కెల్లర్ ఆశయాలు ఆచరణలోకి రావాలి.

హెలెన్ కెల్లర్ ఆశయాలు ఆచరణలోకి రావాలి.
28-06-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: వికలాంగులు, వృద్ధులు, వితంతువుల సంక్షేమానికి ప్రభుత్వాలు మాటలు కాకుండా చేతల్లో చూపాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ, పుట్టుకతోనే అంధురాలు, బధిరురాలైన హెలెన్ కెల్లర్ పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. వికలాంగులు ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని, ప్రస్తుతం అందుతున్న పింఛన్లను పెంచాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమానికి మండల ఉపాధ్యక్షుడు నాగు నరసింహ అధ్యక్షత వహించగా, పున్న శ్రీధర్, చంద్రశేఖర్, నరసింహ, మచ్చగిరి, అంజయ్య, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హెలెన్ కెల్లర్ ఆశయాలు ఆచరణలోకి రావాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News