Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:27 PM

సీఎం పర్యటన వేళ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నేతల ముందస్తు అరెస్టులు

28-06-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ప్రజాస్వామ్య హక్కులపై ఆంక్షలంటూ ఆందోళన.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్

చిట్యాల,

నల్లగొండ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్, డీవైఎఫ్‌ఐ చిట్యాల మండల అధ్యక్షుడు పందు నరేష్‌తో పాటు డీవైఎఫ్‌ఐ నాయకులు గోలి సాయికిరణ్, ఆరూరి నరసింహలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిరసనలు లేదా వినతిపత్రాల సమర్పణకు అవకాశం లేకుండా చేయడానికే ఈ అరెస్టులు జరిగాయని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అలాంటి హక్కులను హరించే విధంగా ముందస్తు అరెస్టులు చేయడం తగదని పేర్కొన్నారు.నాయకులను ఎలాంటి నేరం లేకుండా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, వెంటనే వారిని విడుదల చేయాలని విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ఘటనపై పోలీసులు మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సమాచారం. కాగా, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

సీఎం పర్యటన వేళ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నేతల ముందస్తు అరెస్టులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News