Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

ట్రినిటీ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

20-06-2026 315 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

'యోగా' ఆకారంలో విద్యార్థుల ఆసనాల విన్యాసాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ హైస్కూల్‌లో శనివారం విద్యార్థులు ఘనంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కలిసి మైదానంలో 'యోగా' అక్షరాల ఆకారంలో కూర్చొని ప్రదర్శించిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యఅతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్ కే.వి.బి. కృష్ణారావు మాట్లాడుతూ.. మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన యోగా విద్యను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతదేశానికే దక్కుతుందని ఆయన గర్వంగా కొనియాడారు. విద్యార్థులు చిన్నతనం నుంచే యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు) విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ట్రినిటీ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News