Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు

20-06-2026 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* జీఓ నంబర్ 44 విడుదల చేసిన ప్రభుత్వం

* న్యాయవాదుల హర్షాతిరేకాలు.. బార్ అసోసియేషన్‌లో మిఠాయిల పంపిణీ

చౌటుప్పల్ న్యాయస్థాన పరిధి (జూరిస్డిక్షన్) లో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓ నంబర్ 44ను విడుదల చేసినట్లు చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాడూరి పరమేష్ వెల్లడించారు. చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు కావడం పట్ల స్థానిక న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ భవనంలో న్యాయవాదులందరూ ఒకరికొకరు స్వీట్లు పంచుకొని, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.​ఈ సందర్భంగా అధ్యక్షులు తాడూరి పరమేష్ మాట్లాడుతూ.. అదనపు కోర్టు ఏర్పాటుతో కేసుల విచారణ మరింత వేగవంతం అవుతుందని, ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.ఈ ​కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శి మక్కా నరసింహ, లైబ్రరీ సెక్రటరీ దేశగొని శ్రీశైలం, డైరెక్టర్లు నకరికంటి జ్యోతి, ఎండీ ఖయ్యూం పాషా, మాజీ అధ్యక్షులు ఉడుగు శ్రీనివాస్ గౌడ్, బాల్యం వెంకట చలపతి, సీనియర్ న్యాయవాదులు భిక్షపతి, బడుగు శ్రీకాంత్, జక్కర్తి శేఖర్, చామట్ల జంగయ్య, భరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News