Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:59 PM

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

20-06-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్‌లో ఆర్డివో శేఖర్ రెడ్డి కి సంఘం నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.

​ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కందుకూరి కిశోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి ముటుకుల్లోజు శ్రావణ్ కుమార్, కోశాధికారి చొల్లేటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన స్వర్ణకారుల పరిస్థితి నేడు నానాటికీ దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలు భారీ పెట్టుబడులతో జువెలరీ షాపులను ఏర్పాటు చేస్తూ, మోసపూరిత ఆర్భాటపు ప్రకటనలతో స్థానిక స్వర్ణకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి స్వర్ణకారులను తక్షణమే ఆదుకోవాలని వారు కోరారు. స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దానికి పాలకమండలిని నియమించాలి. దొంగ బంగారం రికవరీల పేరుతో స్వర్ణకారులు ఎదుర్కొంటున్న పోలీసు వేధింపులను అరికట్టడానికి, జీఓ 272ను సవరించి పటిష్టంగా అమలు చేయాలి.50 సంవత్సరాలు దాటిన స్వర్ణకార వృత్తిదారులకు గీత, నేత కార్మికుల తరహాలోనే నెలకు రూ. 5,000/- జీవనభృతి (పెన్షన్) మంజూరు చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం సభ్యులు కొండోజు సంతోష్ కుమార్, చేపురి లక్ష్మణాచారి, డి.వి. చారి, పెరికేటి గోపాలాచారి, మల్లికార్జున్ , నాగేష్, శ్రీను, రాఘవ, పాండు, అజయ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News