Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు వార్తలను ఖండించాలి. జూన్ 25న ‘హలో ఉపసర్పంచ్.. చలో హైదరాబాద్’ ధర్నాకు పిలుపు

20-06-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేయనున్నట్లు వస్తున్న వార్తలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖండించాలని తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ డిమాండ్ చేశారు. నల్గొండలో జిల్లా అధ్యక్షుడు జోగు నగేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో జూన్ 25న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద చేపట్టనున్న ‘హలో ఉపసర్పంచ్.. చలో హైదరాబాద్’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్‌పై స్పష్టత ఇవ్వాలని, వార్డ్ సభ్యులకు నెలకు రూ.3,000, ఉపసర్పంచ్‌లకు రూ.5,000 గౌరవ వేతనం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లపై స్పందించకపోతే జూన్ 25న భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపసర్పంచులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మజ్జిగ నరేష్, మట్టా శ్రీనివాస్, గోపగాని జానయ్య, అయితగోని వెంకటేశం, సతీష్, నవ్య అనిల్ కుమార్ గౌడ్, కడారి కొండల్, నక్క రాజేష్, మర్రి శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు వార్తలను ఖండించాలి. జూన్ 25న ‘హలో ఉపసర్పంచ్.. చలో హైదరాబాద్’ ధర్నాకు పిలుపు

Article Image

ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేయనున్నట్లు వస్తున్న వార్తలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖండించాలని తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ డిమాండ్ చేశారు. నల్గొండలో జిల్లా అధ్యక్షుడు జోగు నగేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో జూన్ 25న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద చేపట్టనున్న ‘హలో ఉపసర్పంచ్.. చలో హైదరాబాద్’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్‌పై స్పష్టత ఇవ్వాలని, వార్డ్ సభ్యులకు నెలకు రూ.3,000, ఉపసర్పంచ్‌లకు రూ.5,000 గౌరవ వేతనం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లపై స్పందించకపోతే జూన్ 25న భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపసర్పంచులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మజ్జిగ నరేష్, మట్టా శ్రీనివాస్, గోపగాని జానయ్య, అయితగోని వెంకటేశం, సతీష్, నవ్య అనిల్ కుమార్ గౌడ్, కడారి కొండల్, నక్క రాజేష్, మర్రి శివ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News