Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

గాయత్రి మృతిపై మిస్టరీ. భర్త పాత్రపై విచారణ జరపాలంటూ కుటుంబ సభ్యుల డిమాండ్

20-06-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, మసూరీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి మరణం పలు ప్రశ్నలకు తావిస్తోందని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపించారు. ఈ ఘటనపై నిష్పాక్షికంగా, సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోరారు.

గాయత్రి మరణానికి ముందు వరకు ఆరోగ్యంగానే ఉండేదని, ఘటన జరిగిన తీరుపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా భర్త సౌమ్య శ్రీచరణ్ వ్యవహారశైలి, ఘటన అనంతరం ప్రవర్తించిన తీరు అనుమానాలకు కారణమవుతోందని ఆరోపించారు. మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.

సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన గాయత్రి ఉన్నత ఆశయాలతో ముందుకు సాగేదని, యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతోందని తెలిపారు. వైవాహిక జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందులను ఆమె సన్నిహితులతో పంచుకున్నట్లు పేర్కొన్నారు. భర్త నుంచి మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ఆమె చెప్పేదని ఆరోపించారు.

గాయత్రి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు అధికారులు స్పందించాలని కోరారు.

Sthanikam

గాయత్రి మృతిపై మిస్టరీ. భర్త పాత్రపై విచారణ జరపాలంటూ కుటుంబ సభ్యుల డిమాండ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News