Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

రిజర్వేషన్ల వర్గీకరణను సద్వినియోగం చేసుకోవాలి

20-06-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* ఎస్సీల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ

​ముప్పై ఏళ్ల ఆకాంక్ష అయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నెరవేరిన నేపథ్యంలో, ప్రతి మాదిగ బిడ్డా విద్యా, ఉద్యోగాల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ యాదాద్రి భునవగిరి జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం చౌటుప్పల్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న తరుణంలో, చదువుకు దూరమైన మాదిగ విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలలకు పంపేలా గ్రామాల్లో కుల పెద్దలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. జూలై 7న ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామగ్రామాన జెండా ఆవిష్కరణలు, జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరాలు జయప్రదం చేయాలన్నారు.గతంలో వలిగొండ మండలం లింగరాజుపల్లిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు హత్యకు గురైన ఎమ్మార్పీఎస్ నాయకుడు చాట్ల పాండు కేసులో సాక్షులకు రక్షణ కల్పించి, నిందితులకు శిక్ష పడేలా చూడాలని చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకుంటే మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు బోయ లింగస్వామి, బొడ్డు శ్రావణ్ కుమార్, మంచాల మహేష్, పాముకుట్ల భాస్కర్, చాట్ల శివ,సాయి సందీప్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రిజర్వేషన్ల వర్గీకరణను సద్వినియోగం చేసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News