Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
658 కేసులు పరిష్కరించి ఆదర్శంగా నిలిచిన జాతీయ లోక్ అదాలత్ పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 10:08 PM

జర్నలిస్టులపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు డీఎస్పీ శివరాం రెడ్డి హెచ్చరిక..

జర్నలిస్టులపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు డీఎస్పీ శివరాం రెడ్డి హెచ్చరిక..

జర్నలిస్టులపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు డీఎస్పీ శివరాం రెడ్డి హెచ్చరిక..
June 20, 2026 08:51 PM 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్..

నల్గొండ : సమాజంలో ప్రజా సమస్యలు, అవినీతి, అక్రమాలపై కథనాలు రాసే జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి హెచ్చరించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు డీఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. 'జనం సాక్షి' దినపత్రిక నల్గొండ బ్యూరో ప్రతినిధి ఓడపల్లి మధుపై కొందరు నిరాధారమైన, అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విషయమై డీఎస్పీ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టులపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వన్‌టౌన్ సీఐ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావులను ఆయన ఆదేశించారు.

వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించం జర్నలిస్టు సంఘాలు..

​అసలైన జర్నలిస్టులను నకిలీ జర్నలిస్టులుగా చిత్రీకరిస్తూ వారి విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వినతిపత్రంలో జర్నలిస్టుల ముఖ్య డిమాండ్లు..

క్షేత్రస్థాయిలో వార్తలు రాసే పాత్రికేయుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదు. ​సోషల్ మీడియా వేదికగా జర్నలిస్టుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. సమాజంలో మీడియా స్వేచ్ఛను కాపాడటంతో పాటు, జర్నలిస్టుల భద్రతకు పోలీస్ శాఖ తగిన చర్యలు చేపట్టాలి. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గుండగొని జయశంకర్, గాదె రమేష్, నకరబోయిన మల్లేశంయాదవ్, గుండాల యాదగిరి, సలీం, అల్లి మల్లికార్జున్, దండంపల్లి రవి, వెంకట మధు, కుషాల్, శంకర్, హరి, సుధాకర్, ఎండీ కలీమ్ ఖాన్, నవీన్, సైదులు, శివ, సూర్య, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News