Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:27 PM

ఎనిమిదేళ్లు గడిచినా చెరగని జ్ఞాపకాలు.. తండ్రికి ఘన నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

10-06-2026 256 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్‌గిద్ద మండలంలోని ఔదత్‌పూర్ గ్రామంలో కీర్తిశేషులు ఎస్గి ఇరప్ప 8వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమాధిని పూలమాలలతో అలంకరించి, క్యాండిళ్లు వెలిగించి, అగరబత్తులు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుమారులు వై. బాబు, వై. పండరి, వై. ధనరాజ్, వై. మహేష్, వై. సురేష్‌తో పాటు కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు మరియు బంధువులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వై. పండరి మాట్లాడుతూ, తమ తండ్రి మరణించి ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఆయన ప్రేమ, ఆప్యాయత, విలువలు, మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ కుటుంబ సభ్యుల హృదయాల్లో పదిలంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం కీర్తిశేషులు ఎస్గి ఇరప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు రాత్రంతా జాగరణ నిర్వహిస్తూ ఆయనతో గడిపిన మధుర క్షణాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కీర్తిశేషులు ఎస్గి ఇరప్పకు ఘన నివాళులు అర్పించారు.

Sthanikam

ఎనిమిదేళ్లు గడిచినా చెరగని జ్ఞాపకాలు.. తండ్రికి ఘన నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

Article Image

నాగల్‌గిద్ద మండలంలోని ఔదత్‌పూర్ గ్రామంలో కీర్తిశేషులు ఎస్గి ఇరప్ప 8వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమాధిని పూలమాలలతో అలంకరించి, క్యాండిళ్లు వెలిగించి, అగరబత్తులు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుమారులు వై. బాబు, వై. పండరి, వై. ధనరాజ్, వై. మహేష్, వై. సురేష్‌తో పాటు కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు మరియు బంధువులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వై. పండరి మాట్లాడుతూ, తమ తండ్రి మరణించి ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఆయన ప్రేమ, ఆప్యాయత, విలువలు, మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ కుటుంబ సభ్యుల హృదయాల్లో పదిలంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం కీర్తిశేషులు ఎస్గి ఇరప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు రాత్రంతా జాగరణ నిర్వహిస్తూ ఆయనతో గడిపిన మధుర క్షణాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కీర్తిశేషులు ఎస్గి ఇరప్పకు ఘన నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News