Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:29 AM

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారం

07-06-2026 254 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ మండలం లోని వెల్వర్తి గ్రామంలో ఏడు సంవత్సరాల తర్వాత నిర్వహించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికలలో గెలుపొందిన పాలకవర్గానికి ఆదివారం రోజున ఎన్నికల అధికారి కుర్ర సురేష్ ఆధ్వర్యంలో ప్రమాణస్వీకార మహోత్సవం నిర్వహించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో నూతన అధ్యక్షుడిగా బత్తేపు శేఖర్, ఉపాధ్యక్షుడిగా మారబోయిన పరుశురాం, కార్యదర్శిగా సురబోయిన దయాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. డైరెక్టర్లుగా నిమ్మల శేఖర్, దుడ్డు ఆంజనేయులు, బోల్లెబోయిన శేఖర్, మారబోయిన అంజయ్య, దుడ్డు అండాలు, చెవ్వ ఎల్లమ్మలు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపించినందుకు సంఘం అభివృద్ధికి శాయశక్తుల కృషి చేసి ముందు వరుసలో నిలుపుతామని వారు తెలియజేశారు.ముదిరాజ్ సమాజ సంక్షేమం, అభివృద్ధి, ఐక్యత మరియు సభ్యుల హక్కుల పరిరక్షణ కోసం నూతన నాయకత్వం కృషి చేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా

"నియంతృత్వ పాలనకు ముగింపు – ప్రజాస్వామ్యానికి పట్టం కట్టిన వెల్వర్తి ముదిరాజ్ ఐక్యత" అనే నినాదంతో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రాల రాములు, చెవ్వ కృష్ణ, చెవ్వ బిక్షపతి, మారబోయిన బిక్షపతి, సారగండ్ల రాజు, దుడ్డు రమేష్, కాల్వల లింగస్వామి, చెవ్వ మధు, దాసబోయిన వెంకటేశం, దుడ్డు నవీన్, బొల్లబోయిన మధు, నిమ్మల సురేష్, నిమ్మల నవీన్, దుడ్డు గణేష్, బొల్లబోయిన వంశీ, మారబోయిన అనిల్, సారగండ్ల ఉదయ్ ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News