Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:53 AM

ఏఐ–డిజిటల్ లెర్నింగ్‌పై జీడీసీ.హయత్‌నగర్‌లో ఇంటర్న్‌షిప్ విద్యార్థులకు భవిష్యత్ నైపుణ్యాలపై శిక్షణ

19-06-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్,: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ లెర్నింగ్ రంగాల్లో విద్యార్థులు, అధ్యాపకులను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జీడీసీ) హయత్‌నగర్‌లో రెండు రోజుల టీచింగ్ ఇంటర్న్‌షిప్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. తెలంగాణ కాలేజియేట్ విద్యా కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అన్న–అక్క మెంటార్‌షిప్/ఇంటర్న్‌షిప్’ కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ జరుగుతోంది.

‘డిజిటల్ భవిష్యత్తు కోసం ఏఐ ద్వారా విద్యావేత్తలను సాధికారపరచడం’ అనే అంశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఉప ప్రిన్సిపాల్ వి. ఇందిర మాట్లాడుతూ ప్రస్తుత ఉద్యోగ విపణిలో డిజిటల్ నైపుణ్యాల ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందని, విద్యార్థులు ఏఐ సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన డా. పి. బిక్షపతి మాస్టర్ ట్రైనర్‌గా వ్యవహరిస్తూ ఏఐ టూల్స్, స్మార్ట్ క్లాస్‌రూమ్ విధానాలు, స్వయం–ఎన్‌పీటీఈఎల్ ఆన్‌లైన్ వనరులు, ఏఐ ఆధారిత మూల్యాంకన పద్ధతులపై శిక్షణ అందిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. సురేష్ బాబు మాట్లాడుతూ, ‘‘ఏఐ భవిష్యత్ సాంకేతికత మాత్రమే కాదు.. నేటి అవసరం కూడా’’ అని పేర్కొన్నారు. విద్యార్థులు నైతిక విలువలను పాటిస్తూ ఏఐ వినియోగంతో తమ విద్యా, బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు.

జూన్ 18 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అన్న–అక్క’ కార్యక్రమంలో భాగంగా జీడీసీ హయత్‌నగర్‌లో ఐదో సెమిస్టర్‌కు చెందిన 100 మంది విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. శిక్షణ పూర్తిచేసిన వారికి అకడమిక్ క్రెడిట్లు, సర్టిఫికెట్లు అందజేయనున్నారు.

కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మధు, డాక్టర్ శేఖర్, డాక్టర్ మక్ల, డాక్టర్ యాదగిరి, డాక్టర్ అవేస్, డాక్టర్ దుర్గాప్రసాద్, రజిత, మమత, ఉమారాణి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఏఐ–డిజిటల్ లెర్నింగ్‌పై జీడీసీ.హయత్‌నగర్‌లో ఇంటర్న్‌షిప్ విద్యార్థులకు భవిష్యత్ నైపుణ్యాలపై శిక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News