Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:59 PM

చౌటుప్పల్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత: ఒకరిపై కేసు నమోదు

19-06-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవలమ్మ నాగారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ ఆదేశాల మేరకు ఎస్సై ఎస్. కృష్ణ మాస్ తన సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారంతో గ్రామంలోని ఒక కిరాణా షాపుపై దాడి నిర్వహించారు.​​గ్రామానికి చెందిన ఎస్కే హాజరత్ (48, తండ్రి: షేక్ లాలూ మహమ్మద్) అనే వ్యక్తి కిరాణా షాప్ నడుపుతున్నాడు. అతను వైన్ షాప్ నుండి మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి తీసుకురాగా, అతని భార్య సైదాబీ వాటిని కిరాణా షాపులో అక్రమంగా అమ్ముతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.పోలీసులు సదరు కిరాణా షాప్ నుండి 09 ఆర్‌సి (RC) బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.​ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు. చట్టవిరుద్ధంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Sthanikam

చౌటుప్పల్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత: ఒకరిపై కేసు నమోదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News