Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:51 AM

నాలుగు దిక్కులా గుంతలే.. ఉత్తటూరుకు రాకపోకలు కష్టమే! రోడ్ల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్‌ యువనేత మేడి రాజు

18-06-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఉత్తటూరు గ్రామానికి వెళ్లే రహదారులు పూర్తిగా గుంతలమయంగా మారడంతో గ్రామ ప్రజలు, విద్యార్థులు, రైతులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని బీఆర్‌ఎస్‌ యువనేత మేడి రాజు విమర్శించారు. చిట్యాల–ఉత్తటూరు–ఇస్కిళ్ల మార్గంతో పాటు జనంపల్లి–ఉత్తటూరు, ఉత్తటూరు–పిల్లిగూడం–కక్కిరేణి, ఉత్తటూరు–మాండ్ర రహదారులు అధ్వాన్నంగా మారాయని తెలిపారు.

కంకర రాళ్లు తేలిపోయి రహదారులు ప్రమాదకరంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉత్తటూరు నుంచి ఇస్కిళ్ల మీదుగా మునిపంపుల బ్యాంకుకు వెళ్లే ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో చిట్యాల నుంచి వనిపాకల, ఉత్తటూరు, ఇస్కిళ్ల, కక్కిరేణి వరకు నడిచిన బస్సు సర్వీసును నిలిపివేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు అదనపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి, బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామానికి నాలుగు వైపులా మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించాలని కోరారు.

Sthanikam

నాలుగు దిక్కులా గుంతలే.. ఉత్తటూరుకు రాకపోకలు కష్టమే! రోడ్ల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్‌ యువనేత మేడి రాజు

Article Image

రామన్నపేట మండలంలోని ఉత్తటూరు గ్రామానికి వెళ్లే రహదారులు పూర్తిగా గుంతలమయంగా మారడంతో గ్రామ ప్రజలు, విద్యార్థులు, రైతులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని బీఆర్‌ఎస్‌ యువనేత మేడి రాజు విమర్శించారు. చిట్యాల–ఉత్తటూరు–ఇస్కిళ్ల మార్గంతో పాటు జనంపల్లి–ఉత్తటూరు, ఉత్తటూరు–పిల్లిగూడం–కక్కిరేణి, ఉత్తటూరు–మాండ్ర రహదారులు అధ్వాన్నంగా మారాయని తెలిపారు.

కంకర రాళ్లు తేలిపోయి రహదారులు ప్రమాదకరంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉత్తటూరు నుంచి ఇస్కిళ్ల మీదుగా మునిపంపుల బ్యాంకుకు వెళ్లే ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో చిట్యాల నుంచి వనిపాకల, ఉత్తటూరు, ఇస్కిళ్ల, కక్కిరేణి వరకు నడిచిన బస్సు సర్వీసును నిలిపివేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు అదనపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి, బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామానికి నాలుగు వైపులా మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News