Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:21 PM

న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి.

న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి.

న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి.
18-06-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రంలోని అన్ని నమోదిత న్యాయవాదులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. జూన్ 20న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న న్యాయవాదుల ధర్నా కరపత్రాన్ని గురువారం రామన్నపేట బార్ అసోసియేషన్ హాల్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 తర్వాత నమోదు చేసుకున్న వేలాది మంది న్యాయవాదులు ఇప్పటికీ హెల్త్ కార్డుల ప్రయోజనాలకు దూరంగా ఉన్నారని తెలిపారు. ఆరోగ్య బీమా పరిమితి పెంపుతో పాటు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులను కూడా బీమా పరిధిలోకి తీసుకురావాలని కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఆసుపత్రులను ఎంపానెల్ చేయడంతో పాటు అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు అదనపు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి. మజీద్, కార్యదర్శి యాదాసు యాదయ్య, ఉపాధ్యక్షుడు సంగిశెట్టి బాలరాజు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News