Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:15 PM

మానూర్‌లో పంచాయతీ కార్యదర్శుల వీడ్కోలు – నూతన కార్యదర్శులకు ఘన స్వాగత సన్మానం

17-06-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ వీడ్కోలు, నూతన కార్యదర్శుల స్వాగత సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డివిజన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డివిజనల్ పంచాయతీ అధికారికి శాలువా, పూలమాలలతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్తున్న పంచాయతీ కార్యదర్శులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతూ వారు మండల అభివృద్ధికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే బదిలీపై మనూర్ మండలానికి నూతనంగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బదిలీలు ఉద్యోగ జీవితంలో సహజమైన భాగమని, కొత్తగా వచ్చిన కార్యదర్శులు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలతో సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్ధి, పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలు మరియు మౌలిక వసతుల కల్పనలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శుల సేవలు గ్రామాల అభివృద్ధికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఆత్మీయ వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి, మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మానూర్‌లో పంచాయతీ కార్యదర్శుల వీడ్కోలు – నూతన కార్యదర్శులకు ఘన స్వాగత సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News