Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:27 PM

క్లిష్ట శస్త్రచికిత్సతో రోగికి పునర్జన్మ పేగు చీలిక, సెప్సిస్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన యశోద వైద్యులు

18-06-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్/నల్గొండ,: పేగు చీలిక, తీవ్రమైన ఇన్ఫెక్షన్ (సెప్సిస్), బహుళ అవయవ సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగిని మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు క్లిష్ట శస్త్రచికిత్స ద్వారా కాపాడారు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన 55 ఏళ్ల ఉయ్యాల నర్సింహ కడుపునొప్పి, జ్వరం, మల విసర్జన కాకపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఇతర ఆసుపత్రిలో అప్పెండిక్స్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో యశోద ఆసుపత్రికి తరలించారు.

వైద్య పరీక్షల్లో పేగు చీలిక, సెప్సిస్, అప్పెండిక్యులర్ అబ్సెస్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే అత్యవసర శస్త్రచికిత్స చేపట్టారు. కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. వెంకటేష్ శ్రీపతి ఆధ్వర్యంలో రైట్ హేమికోలెక్టమీ, ఐలియోట్రాన్స్‌వర్స్ అనాస్టమోసిస్‌తో కూడిన క్లిష్ట శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు.

శస్త్రచికిత్స అనంతరం రోగికి ఐసీయూలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందించారు. బయాప్సీ పరీక్షల్లో అమిబిక్ కొలైటిస్‌కు సంబంధించిన లక్షణాలు బయటపడగా, క్యాన్సర్ ఆనవాళ్లు లేవని వైద్యులు తెలిపారు. సమయానికి శస్త్రచికిత్స, సమన్వయ వైద్య సేవల వల్లే రోగి ప్రాణాలు కాపాడగలిగామని పేర్కొన్నారు.

డయాబెటిస్, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ నిరంతర పర్యవేక్షణతో రోగి కోలుకుని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. అనంతరం ఫాలోఅప్ సూచనలతో డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.

యశోద ఆసుపత్రిలో అత్యాధునిక శస్త్రచికిత్స సదుపాయాలు, క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులో ఉండటం వల్లే ఇలాంటి క్లిష్ట కేసులను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.

Sthanikam

క్లిష్ట శస్త్రచికిత్సతో రోగికి పునర్జన్మ పేగు చీలిక, సెప్సిస్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన యశోద వైద్యులు

Article Image

హైదరాబాద్/నల్గొండ,: పేగు చీలిక, తీవ్రమైన ఇన్ఫెక్షన్ (సెప్సిస్), బహుళ అవయవ సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగిని మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు క్లిష్ట శస్త్రచికిత్స ద్వారా కాపాడారు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన 55 ఏళ్ల ఉయ్యాల నర్సింహ కడుపునొప్పి, జ్వరం, మల విసర్జన కాకపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఇతర ఆసుపత్రిలో అప్పెండిక్స్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో యశోద ఆసుపత్రికి తరలించారు.

వైద్య పరీక్షల్లో పేగు చీలిక, సెప్సిస్, అప్పెండిక్యులర్ అబ్సెస్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే అత్యవసర శస్త్రచికిత్స చేపట్టారు. కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. వెంకటేష్ శ్రీపతి ఆధ్వర్యంలో రైట్ హేమికోలెక్టమీ, ఐలియోట్రాన్స్‌వర్స్ అనాస్టమోసిస్‌తో కూడిన క్లిష్ట శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు.

శస్త్రచికిత్స అనంతరం రోగికి ఐసీయూలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందించారు. బయాప్సీ పరీక్షల్లో అమిబిక్ కొలైటిస్‌కు సంబంధించిన లక్షణాలు బయటపడగా, క్యాన్సర్ ఆనవాళ్లు లేవని వైద్యులు తెలిపారు. సమయానికి శస్త్రచికిత్స, సమన్వయ వైద్య సేవల వల్లే రోగి ప్రాణాలు కాపాడగలిగామని పేర్కొన్నారు.

డయాబెటిస్, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ నిరంతర పర్యవేక్షణతో రోగి కోలుకుని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. అనంతరం ఫాలోఅప్ సూచనలతో డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.

యశోద ఆసుపత్రిలో అత్యాధునిక శస్త్రచికిత్స సదుపాయాలు, క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులో ఉండటం వల్లే ఇలాంటి క్లిష్ట కేసులను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News