రామన్నపేట
రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం అన్నారు. బుధవారం రామన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తూకం, చెల్లింపులు, కోతల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని గుర్తించి లింగయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారని తెలిపారు. రైతుల సమస్యలను ప్రస్తావిస్తే రాజకీయ విమర్శలు చేయడం తగదని, కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి