Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:20 PM

తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య

తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య

తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య
16-06-2026 359 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: రామన్నపేట

తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రామన్నపేట ఎస్ఐ డి. నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక గ్రామానికి కంబాలపల్లి సాయిచరణ్ (23) ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ఎలాంటి పని చేయకుండా ఖాళీగా ఇంట్లోనే ఉంటుండటం తో ఏదైనా పని చూసుకుని స్థిరపడవచ్చు కదా" అని తండ్రి అంజయ్య అతడిని మందలించాడు. ​దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయిచరణ్ సోమవారం రాత్రి అందాజగా 08:30 గంటల సమయంలో ఎవరూ లేని తమ పాత ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు అని తెలిపారు. ​మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు.

Sthanikam

తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News