Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డీఈఓకు వినతి.

15-06-2026 176 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు ప్రచారాలతో అడ్మిషన్లు చేపడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులను మోసగిస్తున్న పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి బిక్షపతికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు, జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా ఫీజులు నిర్ణయించి అధిక మొత్తాలు వసూలు చేస్తోందని ఆరోపించారు. సీబీఎస్‌ఈ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మోసగిస్తున్నారని విమర్శించారు. ‘మోడల్ స్కూల్’ పేరును అనధికారికంగా వినియోగిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.

గ్రామీణ ప్రాంతమైన రామన్నపేటలో అధిక ఫీజుల సంస్కృతిని తీసుకొచ్చి పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతున్నారని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలలకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకేసారి అనుమతులు ఉండవని, అయినప్పటికీ పదో తరగతి వరకు బోధన ఉందంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే పాఠశాలను తనిఖీ చేసి సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్, జిల్లా గర్ల్స్‌ కన్వీనర్ ఇందురాణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డీఈఓకు వినతి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News