Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హారతులు, అక్షింతలతో విద్యార్థులకు ఘన స్వాగతం.. వెంపటి ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా విద్యా సంవత్సరం ప్రారంభం ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 10:46 PM

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
June 15, 2026 09:09 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

113 వినతులు స్వీకరణ – అధికారులకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు

సూర్యాపేట జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉన్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు సమర్పించిన దరఖాస్తులకు సంబంధిత శాఖలు నిర్దిష్ట ఫార్మాట్‌లో ఖచ్చితమైన సమాచారం అందించాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో పారిశుధ్యం, తాగునీటి సమస్యలు ఉంటే జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల అత్యవసర పరిస్థితులు ఏర్పడితే విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ సంస్థలు మానవతా దృక్పథంతో సేవలు అందిస్తున్నాయని, వారి సేవలను మరింత సమర్థంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న సమీక్ష సమావేశాలను వెంటనే నిర్వహించుకోవాలని ఆదేశించారు. ఈ యాసంగి సీజన్‌లో జిల్లాలో 3 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, ఈ ప్రక్రియలో సహకరించిన అదనపు కలెక్టర్, పౌర సరఫరాలు, డీఆర్‌డీఏ, మెప్మా, వ్యవసాయ శాఖ, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లను అభినందించారు. ధాన్యం కొనుగోలులో ఇంకా ఏవైనా సమస్యలు పెండింగ్‌లో ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత పోర్టల్‌లో ఇంకా పరిష్కారం కాని దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెంటనే నమోదు చేయాలని తెలిపారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని అన్నారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 113 దరఖాస్తులు అందాయి. వీటిలో భూ సమస్యలకు సంబంధించినవి 58, డీడబ్ల్యూఓకు 10, డీపీఓకు 7, మత్స్యశాఖకు 5, డీఆర్‌డీఏకు 4, మిగిలిన 31 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించినవని తెలిపారు. వాటిని పరిష్కారం కోసం శాఖల వారీగా పంపించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, జడ్పీ సీఈవో శిరీష, డీఎంహెచ్ఓ వెంకటరమణ, సీపీఓ కిషన్ నాయక్, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీఈఓ అశోక్, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావుతో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News