Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:50 AM

నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి.

15-06-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నాయి బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, చైర్మన్ పదవిని నాయి బ్రాహ్మణ వర్గానికే కేటాయించాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల భిక్షం డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రాచీన కాలం నుంచి క్షవర వృత్తి సమాజానికి విశేష సేవలు అందిస్తోందని, ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతలో నాయి బ్రాహ్మణుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అయితే ఆధునిక కాలంలో కార్పొరేట్ సెలూన్ల విస్తరణతో సంప్రదాయ క్షవర వృత్తిదారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం క్షవర వృత్తిదారులకు ఆధునిక పరికరాలు అందించడంతో పాటు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు పాలక మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే 50 సంవత్సరాలు నిండిన నాయి బ్రాహ్మణులకు పెన్షన్ మంజూరు చేయాలని, దేవాలయ కళ్యాణకట్టల్లో పనిచేస్తున్న క్షురకులను పర్మినెంట్ చేయాలని, పాఠశాలలు, హాస్టళ్లు, ఆస్పత్రులు, పోలీస్ శాఖల్లో బార్బర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మహిళలకు బ్యూటీ పార్లర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి క్షవర వృత్తిదారుడికి మెడికల్ కిట్ అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు రాపర్తి గణేష్, ఉపాధ్యక్షుడు దడిపెల్లి గణేష్, కోశాధికారి వావిళ్ల సంతోష్, వేముల అశోక్, రాసమల్ల శ్రీకాంత్, జంపాల మురళి, మహేష్, వేముల దశరథ, డి.నాగరాజు, జంపాల నరేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News