Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:19 PM

చదువుల బాటలో తొలి అడుగు.. మంగళహారతులతో స్వాగతం

15-06-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని దేగులవాడి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం కొత్త విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని విద్యార్థి విద్యార్థినులకు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను పాఠశాల సిబ్బంది, గ్రామ సర్పంచ్ బస్వాపురం పద్మావతి, ఉపసర్పంచ్ మోహన్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆప్యాయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొనగా, గ్రామ ప్రజలు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొంటూ, ఆహ్లాదకర వాతావరణంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

Sthanikam

చదువుల బాటలో తొలి అడుగు.. మంగళహారతులతో స్వాగతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News