Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:48 AM

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా ఉంటాం

15-06-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన కొప్పుల వేణారెడ్డి

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు నగదు ప్రోత్సాహకాలు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జడ్‌పీహెచ్‌ఎస్ హైస్కూల్‌లో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సోమవారం నగదు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు మంచి సంస్కారం, క్రమశిక్షణ అలవరచుకోవాలని సూచించారు. సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే గురువుల పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలని అన్నారు.

పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహాయం చేయాలని కోరారు.

విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ఇటువంటి పురస్కారాలు ఉపయోగపడతాయని, భవిష్యత్తులో కూడా పాఠశాలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా ఎన్. మేఘనకు రూ.1,00,000, రెండో బహుమతిగా వి. శృతికి రూ.50,000, మూడో బహుమతిగా దీక్షితకు రూ.25,000 నగదు పురస్కారాలు అందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వెలుగు వెంకన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, సజీవ్, ఎన్. రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా ఉంటాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News