Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:23 PM

ఆర్భాటాలకు దూరంగా.. అన్నదానంతో సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు

15-06-2026 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు దూరంగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రామన్నపేట మండలంలోని బోగారం గ్రామ సర్పంచ్ కునూరి సాయికుమార్ గౌడ్. తన జన్మదినాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్‌లోని అమ్మానాన్న ఆశ్రమంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఆశ్రమంలోని వృద్ధులు, నిరాశ్రయులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్న ఆయన, అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికీ భోజనాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆశ్రమవాసులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు సాయికుమార్ గౌడ్ సేవాభావాన్ని అభినందించారు. సమాజంలోని నిరుపేదలు, వృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు, అభిమానులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్భాటాలకు దూరంగా.. అన్నదానంతో సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు

Article Image

పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు దూరంగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రామన్నపేట మండలంలోని బోగారం గ్రామ సర్పంచ్ కునూరి సాయికుమార్ గౌడ్. తన జన్మదినాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్‌లోని అమ్మానాన్న ఆశ్రమంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఆశ్రమంలోని వృద్ధులు, నిరాశ్రయులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్న ఆయన, అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికీ భోజనాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆశ్రమవాసులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు సాయికుమార్ గౌడ్ సేవాభావాన్ని అభినందించారు. సమాజంలోని నిరుపేదలు, వృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు, అభిమానులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News