Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 07:32 PM

ప్రభుత్వ బడులకే ప్రాధాన్యం.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా. బడిబాటలో సర్పంచ్ మధురవేణి సురేష్

ప్రభుత్వ బడులకే ప్రాధాన్యం.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా. బడిబాటలో సర్పంచ్ మధురవేణి సురేష్

ప్రభుత్వ బడులకే ప్రాధాన్యం.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా.  బడిబాటలో సర్పంచ్ మధురవేణి సురేష్
June 15, 2026 03:59 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని, ప్రతి బడిఈడు పిల్లవాడిని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కక్కిరేణి గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్ పిలుపునిచ్చారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సోమవారం కక్కిరేణి గ్రామంలో నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమంలో ఆమె పాల్గొని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల కుటుంబాలకు సంక్షేమ పథకాల అమలులో ప్రాధాన్యత కల్పించాలనే ఉన్నతాధికారుల సూచనలను గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు, గ్రామస్తులు సహకరించాలని కోరారు.

అనంతరం గ్రామానికి అనుబంధంగా ఉన్న రంగమ్మగూడెంలో ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు స్పందిస్తూ రవాణా సౌకర్యం కల్పిస్తే తమ పిల్లలను కక్కిరేణి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు సిద్ధమని తెలిపారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ నడిగోటి పాండు, ప్రధానోపాధ్యాయుడు బి. ఉపేందర్, ఉపాధ్యాయులు రాజన్‌బాబు, భద్రయ్య, గణేష్, గోపాల్‌రెడ్డి, శ్రీనివాసరావు, శేఖర్‌రెడ్డి, కృష్ణ, స్వర్ణలత, జ్యోతి, వార్డు సభ్యులు చిల్ల చంద్రశేఖర్, కోళ్ల సుమలత వెంకన్న, బోడ మనీషా నరసింహ, పిండి సైదులు, చిల్ల మధు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.





నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి.


రామన్నపేట స్థానికం ప్రతినిధి :


రామన్నపేట: నాయి బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, చైర్మన్ పదవిని నాయి బ్రాహ్మణ వర్గానికే కేటాయించాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల భిక్షం డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రాచీన కాలం నుంచి క్షవర వృత్తి సమాజానికి విశేష సేవలు అందిస్తోందని, ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతలో నాయి బ్రాహ్మణుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అయితే ఆధునిక కాలంలో కార్పొరేట్ సెలూన్ల విస్తరణతో సంప్రదాయ క్షవర వృత్తిదారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు రాపర్తి గణేష్, ఉపాధ్యక్షుడు దడిపెల్లి గణేష్, కోశాధికారి వావిళ్ల సంతోష్, వేముల అశోక్, రాసమల్ల శ్రీకాంత్, జంపాల మురళి, మహేష్, వేముల దశరథ, డి.నాగరాజు, జంపాల నరేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News