Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:51 AM

తిరుమలగిరి(జి) జాతరలో కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు

15-06-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గురప్ప స్వామి, గంగమ్మ తల్లి జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలోని తిరుమలగిరి(జి) గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ గురప్ప స్వామి, గంగమ్మ తల్లి, పోతురాజు జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని గ్రామ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. జాతర గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పిందని, సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడే ఇలాంటి ఉత్సవాలు సమాజ ఐక్యతకు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, తిరుమలగిరి(జి) గ్రామ సర్పంచ్ కొదమగుండ్ల నగేష్, ఉప సర్పంచ్ పిట్ట వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చన్నోజు నరసింహాచారి, షేక్ అబ్దుల్ కరీం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుబ్బాక ప్రభాకర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కంచర్ల సుధాకర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు మంచికంటి గోపిరెడ్డి, బోలక వెంకటేశ్వర్లు, పబ్బు నాగరాజు, బోలక సైదులు, రామ్ రెడ్డి, నకరికంటి సైదులు, కంచర్ల నరేందర్ రెడ్డి, బోగిళ్ల అఖిల్, అరవింద్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ఏలుగురి ఇందిరా వీరయ్యగౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాపర్తి నాగరాజు, వెన్న ఉపేందర్, పట్టణ కాంగ్రెస్ నాయకులు షేక్ రహీం, కోడి కిరణ్, మైనార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులు షేక్ సోహెల్, షేక్ గౌస్ పాషా, నూకల మనోజ్, రాచకొండ శివమణి, రావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

జాతర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Sthanikam

తిరుమలగిరి(జి) జాతరలో కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News