Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కొండూరులో వైభవంగా బోనాల ఉత్సవాలు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 10:03 PM

ఓటరు జాబితా సవరణపై ‘బీఎల్ఏ’లకు పకడ్బందీ శిక్షణ ఇవ్వాలి..

15-06-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

తప్పుల్లేకుండా ముసాయిదా జాబితా రూపొందించాలి..

అధికారులకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశం..

నల్లగొండ : ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో బూత్ స్థాయి ఏజెంట్లకు (బీఎల్ఏ) పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవనంలో ఈఆర్వోలు, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్లు, బీఎల్ఓ సూపర్‌వైజర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో ఎలాంటి సందేహాలకు తావులేకుండా సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేకించి ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శనకు ముందు ఒకటి కంటే రెండుసార్లు క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించారు.

తప్పులకు తావుండొద్దు..

చిరునామా మారిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన (ఆబ్సెంట్) ఓటర్ల వివరాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటరు జాబితా సమగ్ర సవరణలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూపర్‌వైజర్లను ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ బాలు తదితరులు పాల్గొని ఎన్నికల నిబంధనలు ఓటర్ల జాబితా సవరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన కల్పించారు.

Sthanikam

ఓటరు జాబితా సవరణపై ‘బీఎల్ఏ’లకు పకడ్బందీ శిక్షణ ఇవ్వాలి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News