Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట.. నారాయణఖేడ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 08:09 PM

ఆత్మీయ కలయికతో ఘనంగా బోనాల ఉత్సవాలు

ఆత్మీయ కలయికతో ఘనంగా బోనాల ఉత్సవాలు

ఆత్మీయ కలయికతో ఘనంగా బోనాల ఉత్సవాలు
06-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అమ్మవారి సేవలో కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్.. భక్తులకు ఆత్మీయ శుభాకాంక్షలు.

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ రెండో వార్డులో బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆత్మీయత, మతసామరస్య భావన ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు. వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో తరలివచ్చి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.

ఉత్సవాల్లో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె.. వార్డు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పండుగను ప్రజలందరూ కలిసిమెలిసి జరుపుకోవడమే మన ప్రాంత ప్రత్యేకత అని ఆమె పేర్కొన్నారు.

అమ్మవారి ఆశీస్సులతో వార్డు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని షబానా అజీమ్ ఆకాంక్షించారు. హిందూ–ముస్లిం సోదరభావానికి ప్రతీకగా, పరస్పర గౌరవం–ఆత్మీయతలతో పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు.

కౌన్సిలర్ షబానా అజీమ్ భక్తులతో కలసి ఉత్సవాల్లో పాల్గొని ఆప్యాయంగా పలకరించడంతో వార్డులో పండుగ వాతావరణం మరింత సందడిగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Sthanikam

ఆత్మీయ కలయికతో ఘనంగా బోనాల ఉత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News