Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కొండూరులో వైభవంగా బోనాల ఉత్సవాలు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 09:13 PM

నిదానపల్లిలోఅంబరాన్నంటిన బోనాల వేడుకలు.

నిదానపల్లిలోఅంబరాన్నంటిన బోనాల వేడుకలు.

నిదానపల్లిలోఅంబరాన్నంటిన బోనాల వేడుకలు.
06-09-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

డప్పుల మోత.. యువత నృత్యాలు.. మహిళల బోనాల ఊరేగింపుతో నిదానపల్లి పల్లె పండుగ శోభను సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతర యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ముత్యాలమ్మ తల్లికి గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.తొలుత గ్రామపంచాయతీ నుంచి సర్కారు బోనాన్ని సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య పాలకవర్గం, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కోట మైసమ్మ తల్లికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు బోనాలతో తరలిరాగా.. యువకులు ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు. డప్పుల మోతల మధ్య సాగిన ఊరేగింపు ఆకట్టుకుంది. చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని.. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ముగింపు వేడుకలకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నిదానపల్లి సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కుల సంఘ నాయకులు, గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిదానపల్లిలోఅంబరాన్నంటిన బోనాల వేడుకలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News