Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కొండూరులో వైభవంగా బోనాల ఉత్సవాలు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 09:09 PM

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
06-09-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రైవేటీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు – డాటా రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ మొహమ్మద్ మొహినోద్దీన్

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయకుండా ప్రైవేటీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (డాటా) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ మొహమ్మద్ మొహినోద్దీన్ అన్నారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు డాటా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి ఆహ్వానించడం వల్ల ఇప్పటికే ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. విద్య, వైద్యం ప్రజలకు అత్యంత ప్రాథమిక అవసరాలని, వాటిని అందరికీ ఉచితంగా, నాణ్యంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. విద్యను వ్యాపారంగా మార్చడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని, విద్యారంగాన్ని మార్కెట్ శక్తులకు అప్పగించే విధానాలకు స్వస్తి పలకాలని కోరారు. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ సమాన విద్య అందించేందుకు దేశవ్యాప్తంగా కామన్ స్కూల్ విధానం అమలు చేయాలని ప్రొఫెసర్ కె.వై. రత్నం డిమాండ్ చేశారు.విద్యార్థుల్లో మూఢనమ్మకాలను పెంచే విధానాలకు బదులుగా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విద్యను ప్రోత్సహించాలని దేవరశెట్టి రజిత అన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సుమారు 70 శాతం అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రొఫెసర్ వెంకటదాసు మారేడు కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సమయానికి జీతభత్యాలు అందేలా శాలరీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రొఫెసర్ నవోదయ సిద్దు కోరారు. విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు, నాణ్యమైన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో పాల్గొన్న వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ పద్మారావు, రిటైర్డ్ డీఎస్పీ ఎం. గంగాధర్, అడ్వకేట్ మంజులాదేవి, డాటా ఉపాధ్యక్షులు ఎం.ఎన్. నరసయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. పెరుక భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News