Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 06:58 AM

గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు

గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు

గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు
06-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కృష్ణవేణి ప్రతిభ పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం.

చిట్యాల: స్థానిక కృష్ణవేణి ప్రతిభ పాఠశాలలో శనివారం

గురుపూజోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ టి. శ్రీధర్‌ మాట్లాడుతూ.. బోధన వృత్తికి మించిన పవిత్రమైన వృత్తి మరొకటి లేదన్నారు. విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించి, వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సమాజాన్ని జ్ఞానవంతంగా తీర్చిదిద్దే శక్తి గురువులకే ఉందన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంతో పాటు విలువలతో కూడిన విద్యను అందించడమే ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని అన్నారు.

అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News