భువనగిరి,
సర్ధార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా పచ్చిమట్ల మాధవిని, జిల్లా ఉపాధ్యక్షులుగా బూడిద మహేష్ గౌడ్‌ను, సహాయ కార్యదర్శిగా నాలగోని బలరాం గౌడ్‌ను నియమించినట్లు సంఘం జిల్లా అధ్యక్షులు పరిటాల రవికుమార్ గౌడ్ తెలిపారు.శనివారం స్థానిక వివేరా హోటల్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో నూతన నియామకాలను ప్రకటించారు. ఈ సందర్భంగా పరిటాల రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు మహిళా గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. నూతనంగా నియమితులైన ప్రతినిధులు సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు సంఘం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గీత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పంజాల మల్లేష్ గౌడ్, మడల రమేష్ గౌడ్, బత్తిని నరేష్ గౌడ్, నాగిళ్ల సత్యనారాయణ గౌడ్, కోట మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి