Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఐక్యతకు మరో ముందడుగు.. నూతన యూనియన్ ఐడీ కార్డుల పంపిణీ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 09:26 PM

నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపున గురువులకు ఘన సన్మానం.. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు

05-09-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ముస్లాపూర్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా అందోల్ డివిజన్ ఆధ్వర్యంలో జడ్.పి.హెచ్.ఎస్. ముస్లాపూర్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. రమేష్‌తో పాటు ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా సన్మానించి వారి సేవలను అభినందించారు. అలాగే ప్రతి తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా అందోల్ డివిజన్ అధ్యక్షులు టి. సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శి కె. వెంకటేశం, రాయికోడ్ మండల అధ్యక్షులు కె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సందేశం టైమ్స్ జాతీయ దినపత్రిక వ్యవస్థాపకులు శ్రీ శెట్టి వెంకటేష్ గౌడ్, సందేశం టైమ్స్ దినపత్రిక పబ్లిషర్ కాశే అమృత, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ,తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రచార కార్యదర్శి కె. సంగమేశ్వర్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బస్వరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శెట్టి వెంకటేష్ గౌడ్, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ మాట్లాడుతూ ముస్లాపూర్ జడ్.పి.హెచ్.ఎస్. పాఠశాల ఎంతో చక్కగా ఉందని, ఇలాంటి మంచి వాతావరణంలో చదువుకునే అవకాశం లభించడం విద్యార్థుల అదృష్టమని అన్నారు. ఉపాధ్యాయులు బోధించే విద్యతో పాటు వారు చెప్పే మంచి మాటలు, సూచనలు పాటిస్తూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థిలో మంచి మార్పు వచ్చినప్పుడే కుటుంబం, సమాజం, దేశానికి మంచి సత్ఫలితాలు అందుతాయని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను తెలుసుకుని ప్రధానోపాధ్యాయులు ఎస్. రమేష్‌తో పాటు ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.విద్యార్థుల్లో విద్యతో పాటు ప్రతిభ, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. రమేష్,ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపున గురువులకు ఘన సన్మానం.. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News