హైదరాబాద్: ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏ.వి. కళాశాలలో సీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు రోజుల జాతీయ పోషణ మాసోత్సవం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం, నడక, యోగా, క్రీడలను జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. నూనె, చక్కెర వినియోగాన్ని తగ్గించి జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని, మొబైల్ వినియోగాన్ని పరిమితం చేయాలని కోరారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ నిర్మూలనకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘నషా ముక్త్ భారత్’, ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమాలు దేశ భవిష్యత్తు కోసం చేపడుతున్నవేనని తెలిపారు. పీఐబీ, సీబీసీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ మాట్లాడుతూ.. ఐదు రోజుల కార్యక్రమంతో విద్యార్థుల్లో పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కళాశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి