సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు ఆదర్శం.. నాణ్యమైన విద్యతో విలువలు పెంపొందించాలి.
నల్లగొండ: భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో శుక్రవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్ మాట్లాడుతూ.. దేశానికి రాధాకృష్ణన్ అందించిన విద్యా సేవలు, తాత్విక ఆలోచనలు చిరస్మరణీయమన్నారు. ఉపాధ్యాయుడు కేవలం పాఠ్యాంశాలను బోధించే వ్యక్తి కాదని, విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించే మార్గదర్శి అని పేర్కొన్నారు. రాధాకృష్ణన్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని సూచించారు.ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు మాట్లాడుతూ..
రాధాకృష్ణన్ జీవితం, విద్యా తత్వం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మానవీయ విలువలు, బాధ్యతాయుత పౌరసత్వాన్ని అలవర్చడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మరింత నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు నర్సింగ్ కోటయ్య, వెంకటరెడ్డి, డా. అదే మల్లేశం, శివరాణి, బొజ్జ అనిల్‌కుమార్‌తో పాటు అధ్యాపకులు హబీబ్, జాజుల దినేష్, నాగరాజు కదిరే, హశ్రత్ బేగం, వంశీ, పావని, ఎన్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి