ఆకట్టుకున్న చిన్ని కృష్ణులు, గోపికల వేషధారణలు
సందడిగా సాగిన ఉట్టి కొట్టే కార్యక్రమం
స్థానిక విశాల భారతి హైస్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన చిన్ని కృష్ణుడు, గోపికమ్మల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా అలరించాయి. అనంతరం నిర్వహించిన ఉట్టి కొట్టే వేడుకలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పాఠశాల కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుని ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే పిల్లలలో ఆధ్యాత్మిక చింతనను, నైతిక విలువలను పెంపొందించడంలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్యం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి