చిట్యాల: శ్రావణమాసం సందర్భంగా చిట్యాల శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో నాలుగో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, డైరెక్టర్లు తెలిపారు.ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 9.15 గంటలకు పుష్పాభిషేకం వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి చిట్యాల పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రముఖులు, భక్తులు, దాతలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.
శ్రావణమాస ప్రత్యేక పూజల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పుష్పాభిషేకాన్ని ప్రత్యేక ఆహ్వానంగా భావించి భక్తులు పాల్గొని కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ కోరింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి