గ్రీన్‌గ్రోవ్ పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.
చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్‌గ్రోవ్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం చిన్నారుల కృష్ణ, రాధ, గోపికల వేషధారణలతో సందడిగా మారింది. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అందించిన భగవద్గీత బోధనలు మానవ జీవితానికి దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించాలనే సందేశం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.కష్టాలు ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, ధర్మం కోసం నిలబడాలని శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. కోపం, అహంకారం, మితిమీరిన ఆశలను అదుపులో ఉంచుకుని సమతాభావంతో జీవించాలని సూచించారు.పండుగల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలపై అవగాహన పెంపొందుతుందని పేర్కొన్నారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, భక్తిగీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో పాఠశాల ఏవో పోల గోవర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి