Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా సతీష్‌కుమార్‌ నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 09:04 AM

ఖాతాదారుల భద్రతకు ‘కేవైసీ’ తప్పనిసరి

ఖాతాదారుల భద్రతకు ‘కేవైసీ’ తప్పనిసరి

ఖాతాదారుల భద్రతకు ‘కేవైసీ’ తప్పనిసరి
03-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల ఎస్‌బీఐని సందర్శించిన డీజీఎం ప్రియబ్రత మిశ్రా.

చిట్యాల: ఖాతాదారుల భద్రతకు కేవైసీ (KYC) వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలని ఎస్‌బీఐ డీజీఎం ప్రియబ్రత మిశ్రా సూచించారు. గురువారం చిట్యాల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంకు వ్యాపార లావాదేవీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రుణాల మంజూరు, ఖాతాదారులకు అందుతున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బ్యాంకు వ్యాపారాభివృద్ధికి కృషి చేస్తున్న శాఖ మేనేజర్‌ బొజ్జగాని సతీష్‌, సిబ్బందిని డీజీఎం అభినందించి బహుమతిని అందజేశారు. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ బ్యాంకు వ్యాపారాన్ని విస్తరించాలని సూచించారు.

ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ.. ఖాతాదారుల భద్రత, బ్యాంకింగ్‌ సేవల సౌలభ్యం కోసం ప్రతి ఒక్కరూ తమ కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపారు. ఇందుకు బ్యాంకు అధికారులు పూర్తి సహకారం అందిస్తారని పేర్కొన్నారు. ఖాతాదారులకు అందుబాటులో ఉన్న సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పించి, వాటిని విస్తృతంగా వినియోగదారుల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రధానమంత్రి అటల్‌ పెన్షన్‌ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన వంటి పథకాల ప్రయోజనాలను ఖాతాదారులకు వివరించాలని చెప్పారు.

కార్యక్రమంలో ఆర్‌ఎం పద్మ బాబు గౌడ్‌, చిట్యాల శాఖ మేనేజర్‌ బొజ్జగాని సతీష్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ కొల్లాబత్తిని సిసిర, క్యాషియర్‌ చింతకుంట్ల మహేందర్‌, మణికంఠ, యాదగిరి, చంద్రశేఖర్‌, రోష్‌ నారా, కమల, ప్రవీణ్‌, కొల్లోజు వెంకటేశ్వర్లు, స్వర్ణ, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఖాతాదారుల భద్రతకు ‘కేవైసీ’ తప్పనిసరి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News