సంతకం ఫోర్జరీ చేసి రూ.20.87 లక్షలు నొక్కేశారు!
కలెక్టర్‌కు బాధితురాలి ఫిర్యాదు విచారణకు డిమాండ్...
నల్గొండ : అమాయకపు మహిళల నిరక్షరాస్యతను, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సంతకాలు ఫోర్జరీ చేస్తూ లక్షలాది రూపాయల రుణాలు కాజేసిన ఘరానా మోసం కేతేపల్లి మండలంలో వెలుగుచూసింది. తన ప్రమేయం లేకుండా, సంతకాన్ని ఫోర్జరీ చేసి మహిళా సంఘం పేరుతో రూ.20 లక్షలకు పైగా రుణాలు పొంది అక్రమాలకు పాల్పడ్డారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం గ్రామానికి చెందిన పోతుగంటి జయమ్మ, గ్రామంలోని సంఘబంధం-2 పరిధిలోని 'ధనలక్ష్మి మహిళా సంఘం'లో సభ్యురాలిగా ఉంది. ఆమె అనుమతి లేకుండా, సంతకాలను ఫోర్జరీ చేసి సంఘం పేరుతో 2020 నుంచి 2024 వరకు పలు విడతలుగా బ్యాంకులు, శ్రీనిధి సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణాలు పొందినట్లు ఆరోపించింది.
ఏళ్ల తరబడి సాగిన మోసం వివరాలు...
రుణ తేదికాజేసిన మొత్తం (రూ.)14 ఫిబ్రవరి 202080,00025 ఆగస్టు 202050,00029 జూన్ 20212,00,00028 జూలై 20214,86,00029 సెప్టెంబర్ 20227,71,00029 డిసెంబర్ 20233,00,00011 నవంబర్ 20242,00,000మొత్తం20,87,000
బ్యాంకు రుణాలతో పాటు శ్రీనిధి రుణాల విషయంలోనూ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు పక్కదారి పట్టించారని జయమ్మ వాపోయింది.
అధికారులు, లీడర్ల కుమ్మక్కు? ఈ అక్రమాల వెనుక సంఘబంధం-2 విలేజ్ బుక్ కీపర్ (VBK) గుడపురి విజేత, ధనలక్ష్మి సంఘం మొదటి లీడర్ కోట నాగమ్మ, రెండో లీడర్ గుడపురి బూబాతో పాటు అప్పటి కమ్యూనిటీ కోఆర్డినేటర్ (CC) శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రాబ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్‌ల హస్తం ఉందని బాధితురాలు ఆరోపించింది. వీరందరి పాత్రపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో పాటు డిఆర్‌డిఓ-పిడి (DRDO-PD), డిఆర్‌డిఓ-డిపిఎం (DRDO-DPM), కేతేపల్లి ఎంపీడీఓ, డిఆర్‌డిఓ-ఏపీఎం మరియు స్థానిక పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేసింది. అక్రమంగా తన పేరు మీద మోపిన రుణభారం నుంచి విముక్తి కల్పించి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి న్యాయం చేయాలని వేడుకుంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి