శ్రీ జయ ల్యాబ్స్‌లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ సూచించారు. మల్కాపూర్ పరిధిలోని శ్రీ జయ ల్యాబ్స్ కంపెనీలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ... ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంతో వెళ్లడం, డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడటం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పోలీస్ సిబ్బంది, శ్రీ జయ ల్యాబ్స్ కంపెనీ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి