Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ సారాంపల్లి మల్లారెడ్డి కి ఘననివాళులు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 06:53 PM

అవినీతి రహిత సమాజమే పవన్‌ లక్ష్యం

అవినీతి రహిత సమాజమే పవన్‌ లక్ష్యం

అవినీతి రహిత సమాజమే పవన్‌ లక్ష్యం
02-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అవినీతి, కుంభకోణాలకు తావులేని సమాజ నిర్మాణమే జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ లక్ష్యమని ఆ పార్టీ జిల్లా నాయకులు ఏవీ రావు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏవీ రావు మాట్లాడుతూ.. ప్రజల కోసం పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి రూపాయి అర్హులకు చేరేలా, అవినీతికి తావులేని వ్యవస్థ కోసం ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ కీలక మార్పులకు నాంది పలుకుతారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జనసేనను మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పలు కూడళ్లలో అన్నదానం చేశారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో భూక్య సైదులు నాయక్, దండు మధు, సాయి స్వరూప్, ఓరుగంటి జగదీశ్వరి, భూక్య రవి, లింగ నాయక్, సురేష్, సతీష్, సాయి, సైదులు, మనీష్, బాలగిరి, గణేష్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అవినీతి రహిత సమాజమే పవన్‌ లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News