Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డేగుల్‌వాడిలో రైతుల పంటల నమోదు.. క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 04:17 PM

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే లక్ష్యం

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే లక్ష్యం

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే లక్ష్యం
02-09-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యమిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చిట్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పందిరి గీత రమేష్‌ అన్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. కార్మికులకు నెలనెలా జీతాలు సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందించారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ గురులింగం, వైస్‌ చైర్‌పర్సన్‌ శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు సత్యనారాయణ, పరమేశ్‌, షబానా అజీమ్‌, సందీప రాంరెడ్డి, మేనేజర్‌ ఫాతిమా, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌, శానిటరీ జవాన్లు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News