Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:03 PM

రూ.10 వేల లంచం తీసుకుంటూ టోలిచౌకి ఎస్ ఐ అరెస్ట్‌

01-09-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌, సెప్టెంబరు 1:

రూ.10 వేల లంచం తీసుకుంటూ టోలిచౌకి పోలీస్‌స్టేషన్‌ ఎస్సై ఆర్‌. పాండు నాయక్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. మంగళవారం సిటీ రేంజ్‌–1 ఏసీబీ అధికారులు వలపన్ని లంచం స్వీకరిస్తుండగా ఎస్సైను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

తన తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా కుటుంబ సభ్యుల మధ్య సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానని, ఫిర్యాదుదారుడి పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ విధులను నిర్వర్తించడంలో అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. నిందితుడిని అరెస్ట్‌ చేసి నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Sthanikam

రూ.10 వేల లంచం తీసుకుంటూ టోలిచౌకి ఎస్ ఐ అరెస్ట్‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News