Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:43 PM

దళిత జర్నలిస్టులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలి

01-09-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

దళిత జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి, వారి సమస్యలను పరిష్కరించాలని దళిత జర్నలిస్టుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కాషాపొగు జాన్ డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాషాపొగు జాన్, రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా రామని అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాషాపొగు జాన్ మాట్లాడుతూ అంబేద్కర్ అభయహస్తం పథకం కింద రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, ఇల్లు లేదా ఇంటి స్థలం లేని దళిత జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే ఉచిత బస్సు పాస్ సౌకర్యం, ప్రభుత్వ ఆరోగ్య కార్డులు అందించడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. నూతన జిల్లా అధ్యక్షులు రామని అశోక్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సంఘం తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్న కుమార్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు రాపాక విజయరాజు, సీనియర్ జర్నలిస్టులు విలాస్, రాజు, మన్నే పోచయ్య, అశోక్‌తో పాటు పలువురు దళిత జర్నలిస్టులు పాల్గొన్నారు.

Sthanikam

దళిత జర్నలిస్టులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News