నాగోల్, సెప్టెంబరు 1: ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా ఎల్‌బీనగర్ డీసీపీ బి. అనూరాధ, ఐపీఎస్ నాగోల్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు, వివిధ విభాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సిబ్బందితో సమావేశమైన డీసీపీ.. విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. క్రమశిక్షణ, సమర్థతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూనే ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని డీసీపీ అనూరాధ సూచించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి