Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:26 PM

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

01-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ తుంగతుర్తి మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న తుంగతుర్తిలో నిర్వహించనున్న నియోజకవర్గస్థాయి నిరసన ధర్నాను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.తుంగతుర్తి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీతయ్య మాట్లాడుతూ.. అధికారం కోసం అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబీమా వంటి పథకాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మహిళలు, రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న ధర్నాలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, గుజ్జ దీపిక యుగంధర్‌రావు హాజరుకానున్నట్లు తెలిపారు.సమావేశంలో జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్‌, సర్పంచ్‌లు మేడదుల రమేష్‌, మాతంగి వెంకటమ్మ, కరుణాకర్‌, శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు గుడిపాటి వీరయ్య, గోపగాని రమేష్‌, మల్లెపాక రాములు, మాజీ సర్పంచ్‌ విరోజీనాయక్‌, పూర్ణనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News