Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భద్రతకు ‘ఎల్ఐసీ’యే కొండంత అండ: వాసవి కన్‌స్ట్రక్షన్స్ ఎండీ విజయ్‌కుమార్ ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 07:01 PM

నేడే ఎన్‌జీ కళాశాలలో జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్.

01-09-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

డిగ్రీ ఫ్రెషర్లకు ఉద్యోగావకాశం.. రూ.15 వేల వరకు వేతనం.

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలంగాణ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ (TSKC) ఆధ్వర్యంలో కీర్తన ఫిన్‌ సర్వ్‌ గోల్డ్‌ లోన్స్‌ సంస్థ సహకారంతో బుధవారం (సెప్టెంబర్‌ 2) క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. ఉపేందర్‌, TSKC కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం. అనిల్‌కుమార్‌ తెలిపారు.

రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌, ట్రైనీ లోన్‌ ఆఫీసర్‌ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌కు నెలకు రూ.14,000, ట్రైనీ లోన్‌ ఆఫీసర్‌కు రూ.15,000తో పాటు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అదనంగా ప్రావిడెంట్‌ ఫండ్‌, ఈఎస్‌ఐ, మెడికల్‌ ఇన్సూరెన్స్‌, శిక్షణ, కెరీర్‌ అభివృద్ధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

అర్హతలు ఇవే..

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్‌, ఇటీవల ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 26 సంవత్సరాలలోపు ఉండాలి.

ఉదయం 9.30 గంటలకు ఎంపిక ప్రక్రియ.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 2న ఉదయం 9.30 గంటలకు నాగార్జున ప్రభుత్వ కళాశాల సెమినార్‌ హాల్‌కు హాజరు కావాలని నిర్వాహకులు సూచించారు. అభ్యర్థులు అప్‌డేట్‌ చేసిన రెజ్యూమ్‌తో పాటు విద్యార్హత, అవసరమైన ధ్రువపత్రాలు వెంట తీసుకురావాలని తెలిపారు. ఉద్యోగాన్వేషణలో ఉన్న డిగ్రీ ఫ్రెషర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Sthanikam

నేడే ఎన్‌జీ కళాశాలలో జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News